Ambarpet: తమ నాయకుడికి టికెట్ దక్కలేదని టీఆర్ఎస్ కార్యకర్త ఆత్మహత్యాయత్నం

  • సుధాకర్ రెడ్డికి ఇవ్వకుండా వెంకటరెడ్డికి టికెట్
  • కేటీఆర్‌ను కలుద్దామంటే అడ్డుకున్నారు
  • సమయం ఉన్నందున కేసీఆర్ స్పందించాలి

అంబర్‌పేట టికెట్‌ను ఆశిస్తున్న యడ్ల సుధాకర్ రెడ్డికి టీఆర్ఎస్ పార్టీ టికెట్‌ను కేటాయించకపోవడంతో ఆయన అనుచరులు ఆందోళన చేశారు. సుధాకర్ రెడ్డికి ఇవ్వకుండా కాలేరు వెంకటరెడ్డికి టికెట్ కేటాయించడంపై ఆయన అనుచరుడు ఉరి వేసుకునేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.

 ఎన్నో ఏళ్లుగా పార్టీ అభివృద్దికి కృషి చేసిన సుధాకర్ రెడ్డిని కాదని వేరొకరికి టికెట్ ఇవ్వడం సరికాదన్నారు. ఇంకా సమయం ఉన్నందున కేసీఆర్ స్పందించాలని కోరారు. కేటీఆర్‌ను కలుద్దామంటే పోలీసులు అడ్డుకున్నారని సుధాకర్ రెడ్డి అనుచరులు ఆవేదన వ్యక్తం చేశారు.

Ambarpet
Sudhakar Reddy
venkat Reddy
KCR
KTR
  • Loading...

More Telugu News