Telugudesam: లైఫంతా పోయాక ఇంకా బతకడమెందుకు? సూసైడ్ చేసుకుని చచ్చిపోవాలి: కంటతడిపెట్టిన శోభారాణి
- ఇంకా అధిష్ఠానం పిలుపు కోసం ఎదురుచూస్తున్నా
- మొహం చాటేసే పద్ధతిలో ఉంటే నిర్ణయం తీసుకుంటా
- పోరాటాలు చేయడం, ఎదురు తిరగడం నాకు కొత్త కాదు
'తెలుగు మహిళ అధ్యక్షురాలిగా పని చేశాను. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. యాదాద్రి జిల్లా టీడీపీ అధ్యక్షురాలిగా పనిచేస్తున్నాను. నియోజకవర్గ ఇన్ చార్జిగా ఐదేళ్లుగా ఉంటూ కోట్లాది రూపాయలు ఖర్చు చేశాం. చంద్రబాబునాయుడికి అనేక సార్లు మొరపెట్టుకున్నాను. భూములు, జాగాలు, ఇల్లు అమ్ముకున్నాను. నా పిల్లల్ని చదివించడం కోసం చందాలు అడుక్కుని చదివించుకున్న విషయం సార్ (చంద్రబాబు) కు తెలుసు.. లైఫంతా పోయిన తర్వాత.. ఇంకా బతకడమెందుకు? సూసైడ్ చేసుకుని చచ్చిపోవాలి’ అంటూ టీడీపీ నేత శోభారాణి కన్నీరుమున్నీరయ్యారు.
‘ఏ రాజకీయాలను, ఆశయాలను నమ్ముకున్నామో.. అవి నెరవేరనప్పుడు బతకడమెందుకు చెప్పండి? వాస్తవానికి ఏం చేయాలో నాకు తోచడం లేదు. నియోజకవర్గంలోని టీడీపీ క్యాడర్ అంతా నన్ను పోటీ చేయమని అంటున్నారు. కానీ, పోటీ చేయడమా? పార్టీ అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలా? అన్నది తేల్చుకోలేక పోతున్నాను. ఇంకా సమయం ఉంది కాబట్టి వేచి చూస్తాను. పోరాటాలు చేయడం, ఎదురు తిరగడం నాకేమీ కొత్త కాదు.. వెన్నతో పెట్టిన విద్య. నేను ఇంకా అధిష్ఠానం పిలుపు కోసం, మాట కోసం ఎదురు చూస్తున్నాను. అధిష్ఠానం ఇంకా మొహం చాటేసే పద్ధతిలో ఉంటే కనుక, నా నిర్ణయం నేను తీసుకుంటాను’ అని శోభారాణి స్పష్టంగా చెప్పారు.