kcr: ఇంటింటికీ నీళ్లు ఇవ్వకుండానే నామినేషన్ ఎలా వేశారు?: కేసీఆర్ కు జగ్గారెడ్డి సూటి ప్రశ్న

  • తెలంగాణ అప్పు రూ. 2.20 లక్షల కోట్లకు చేరుకుంది
  • నీరు ఇవ్వకుండానే నామినేషన్ ఎలా వేశారు?
  • హామీలు ఇచ్చి మోసం చేసిన ఘనత కేసీఆర్ దే

రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ రాష్ట్ర అప్పు ఇప్పటివరకు రూ. 2.20 లక్షల కోట్లకు చేరుకుందని సంగారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డి మండిపడ్డారు. ఇంత అప్పు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కోట్లను ఎవరికిచ్చారో లెక్క చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇంటింటికీ నీరు ఇచ్చాకే ఓట్లు అడుగుతానని కేసీఆర్ చెప్పారని... నీరు ఎవరికిచ్చారో కేసీఆర్ చెప్పాలని అన్నారు. నీరు ఇవ్వకుండానే నామినేషన్ ఎలా వేశారని ప్రశ్నించారు. కేసీఆర్ కు, ఆయన కుటుంబసభ్యులకు నామినేషన్ వేసే అర్హత లేదని అన్నారు. రైతు రుణమాఫీ జరగలేదని, దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వలేదని, భగీరథ లేదని విమర్శించారు. హామీలు ఇచ్చి, ప్రజలను మోసం చేసిన ఘనత కేసీఆర్ దే అని అన్నారు. ఈరోజు నామినేషన్ వేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఆయన పైవ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News