allari naresh: రెండు హిట్లు ఇచ్చిన దర్శకుడితో అల్లరి నరేశ్

  • వరుస పరాజయాలు 
  • సక్సెస్ కోసం ప్రయత్నాలు 
  • త్వరలో మరో ప్రాజెక్టుతో సెట్స్ పైకి      

హాస్య కథానాయకుడిగా అల్లరి నరేశ్ చేసిన విన్యాసాలు .. అందుకున్న విజయాలు అన్నీ ఇన్నీ కావు. అయితే కొంతకాలంగా ఆయనకి సరైన హిట్ పడనే లేదు. దాంతో అప్పటి నుంచి కూడా ఆయన సక్సెస్ కోసం వెయిట్ చేస్తూనే వున్నాడు. అయినా ఆయనకి నిరాశనే ఎదురవుతూ వస్తోంది. ప్రస్తుతం ఆయన 'మహర్షి' సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను చేస్తున్నాడు.

ఇక ఈ తరహా పాత్రలనే చేస్తాడేమోనని అనుకున్నవారు లేకపోలేదు. కానీ తాను హీరోగా కొనసాగాలనే పట్టుదలతోనే అల్లరి నరేశ్ వున్నాడు. త్వరలో జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'సీమశాస్త్రి' .. 'సీమటపాకాయ్' సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటిస్తారట. ఈ సినిమాతోనైనా అల్లరి నరేశ్ కి హిట్ పడుతుందేమో చూడాలి.          

allari naresh
  • Loading...

More Telugu News