Andhra Pradesh: వైఎస్ ప్రతి ఆరోపణపైనా సీబీఐ దర్యాప్తు కోరేవారు.. ఆ ధైర్యం మీకెక్కడిది?: చంద్రబాబుపై విజయసాయిరెడ్డి ఫైర్

  • అన్ని వ్యవస్థలను బాబు భ్రష్టు పట్టించారు
  • గొప్పగొప్ప నియంతలే కాలగర్భంలో కలిసిపోయారు
  • ముఖ్యమంత్రిపై విమర్శలు గుప్పించిన వైసీపీ నేత

దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ప్రతిపక్షాలు ఎప్పుడు డిమాండ్ చేసినా సీబీఐ విచారణకు ఆదేశించేవారని వైసీపీ నేత విజయసాయిరెడ్డి తెలిపారు. అలాంటి ధైర్యం ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేదని విమర్శించారు. అందుకే అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించి ప్రశ్నించేవారిని అడ్డు తొలగించుకోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. గొప్పగొప్ప నియంతలే కాలగర్భంలో కలిసి పోయారనీ, అలాంటిది చంద్రబాబు తనను తాను ఓ రాజు, ఏపీ ఆయన ప్రత్యేక రాజ్యం అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఫేస్ బుక్ లో ఈ రోజు స్పందిస్తూ.. ‘వైఎస్ గారు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రతి ఆరోపణ పైనా సిబీఐ దర్వాప్తు కోరేవారు. అటువంటి ధైర్యం మీకేది. వ్యవస్థల్ని భ్రష్టు పట్టించి మిమ్మల్ని ఛాలెంజ్ చేసేవారందరిని అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నారు. మీరో రాజు.. మీది ప్రత్యేక రాజ్యమనుకుంటున్నారా? మీలాంటి మహా మహా నియంతలు కాలగర్భంలో కలిసి పోయారు. చరిత్ర హీనులయ్యారు’ అంటూ పోస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News