Harish Rao: బహిరంగ చర్చకు డీకే అరుణ సిద్ధమా?: హరీష్ రావు

  • వలస కూలీలు వెనక్కి వచ్చేలా చేసిన ఘనత టీఆర్ఎస్ దే
  • గద్వాల అభివృద్ధి చెందాలంటే కేసీఆర్ సీఎం కావాలి
  • మహాకూటమిని మట్టిలో కలిపేయాలి

హైదరాబాదుకు కూలీలుగా వలస వెళ్లిన వారిలో పాలమూరు జిల్లాకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారని... ఈ వలస కూలీలు మళ్లీ వెనక్కి వచ్చేలా చేసిన ఘనత టీఆర్ఎస్ దే నని మంత్రి హరీష్ రావు అన్నారు. గద్వాల నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే కేసీఆర్ కచ్చితంగా ముఖ్యమంత్రి కావాలని చెప్పారు. గట్టు ఎత్తిపోతల పథకంపై బహిరంగ చర్చకు డీకే అరుణ సిద్ధమేనా? అని సవాల్ విసిరారు. మహాకూటమి అధికారంలోకి వస్తే... మరోసారి నీటి పోరాటాలు చేయాల్సి వస్తుందని చెప్పారు. అందుకే మహాకూటమిని మట్టిలో కలిపేయాల్సిన అవసరం ఉందని... ఆ బాధ్యత టీఆర్ఎస్ కార్యకర్తలదేనని అన్నారు.

Harish Rao
KTR
dk aruna
gadwel
congress
TRS
  • Loading...

More Telugu News