kcr: కేసీఆర్ మలివిడత ఎన్నికల ప్రచారం 19 నుంచి ప్రారంభం

  • మలి విడత ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు
  • 19 నుంచి 25వ తేదీ వరకు బహిరంగ సభలు
  • పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపనున్న కేసీఆర్

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో టీఆర్ఎస్ సహా ప్రతిపక్ష పార్టీల ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే తొలి విడత ప్రచారంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మలి విడత ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఇందుకు సంబంధించి ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 19 నుంచి 25వ తేదీ వరకు పలు చోట్ల నిర్వహించే టీఆర్ఎస్ బహిరంగ సభల్లో ఆయన పాల్గొననున్నారు.

19న ఖమ్మం, పాలకుర్తిలో, 20న సిద్ధిపేట, హుజురాబాద్, సిరిసిల్ల, ఎల్లారెడ్డిలో, 21న జడ్చర్ల, దేవరకొండ, నకిరేకల్, భువనగిరి, మెదక్ లో, 22న ఖానాపూర్, ఇచ్చోడ, నిర్మల్, ముథోల్, ఆర్మూర్ లో, 23న నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్, సూర్యాపేట, తుంగతుర్తి, జనగామ, 25న తాండూరు, పరిగి, నారాయణపేట, దేవరకద్ర, షాద్ నగర్, ఇబ్రహీంపట్నంలో నిర్వహించే సభల్లో కేసీఆర్ ప్రసంగించనున్నారు.

kcr
TRS
election campaign
  • Loading...

More Telugu News