rajani: అప్పట్లో రజనీకాంత్ నన్ను లిఫ్ట్ అడిగేవాడు .. ఇప్పుడు ఆయన కుబేరుడు: నటుడు హేమసుందర్

  • రజనీ కుబేరుడు అయ్యాడు 
  • గర్వాన్ని దగ్గరికి రానీయలేదు 
  • లైట్ బాయ్ ను కూడా పలకరిస్తాడు 

ఒకప్పుడు తెలుగు తెరపై తండ్రి పాత్రల్లో ఎక్కువగా కనిపించిన నటుడు హేమసుందర్. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, రజనీతో తనకి గల బంధాన్ని గురించి ప్రస్తావించారు. రజనీకాంత్ హీరోగా ఎదగడానికి ముందు నుంచే నాకు తెలుసు. ఆయనతో నాకు చాలా సాన్నిహిత్యం వుంది. అప్పట్లో నాకు స్కూటర్ ఉండేది .. ఆ స్కూటర్ పై నేను వెళుతుంటే నన్ను లిఫ్ట్ అడిగేవాడు. 'నీకు ట్రబుల్ ఇస్తున్నాను' అనేవాడు.

 'నేనేమైనా భుజాల మీద మోసుకెళుతున్నానా .. కూర్చో'  అనేవాడిని. అలా నన్ను లిఫ్ట్ అడిగిన రజనీకాంత్ రాకెట్ వేగంతో దూసుకుపోయాడు. తనకి ఎంత ఆస్తి ఉందనే విషయం తనకే తెలియనంత ఎత్తుకు ఎదిగిపోయాడు. ఆయన కుబేరుడిగా మారిపోయినా .. గర్వాన్ని మాత్రం దగ్గరికి రానీయలేదు. లైట్ బాయ్ భుజాన చేయివేసి 'ఎలా వున్నావురా' అని ఆప్యాయంగా అడగడం ఆయనకే చెల్లింది. రజనీకి జీవితంలో నటించడం తెలియదు. అందుకే ఇంతమంది మనసులో ఆయనకి ఇంతటి స్థానం లభించింది" అని చెప్పుకొచ్చారు. 

rajani
hemasundar
  • Loading...

More Telugu News