Karnataka: నాన్న ప్రేమతో కొనిచ్చిన సెల్ ఫోన్ పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని!

  • కర్ణాటకలోని మైసూరులో ఘటన
  • సెల్ ఫోన్ ను పోగొట్టుకున్న నిఖిత
  • ఉరేసుకుని ఆత్మహత్య

తన తండ్రి ప్రేమతో కొనిచ్చిన సెల్ ఫోన్ ను పోగొట్టుకున్నానన్న మనస్తాపంతో పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన కర్ణాటకలోని, మైసూరు, గాంధీనగర్ లో జరిగింది. ఇక్కడి ఓ ప్రైవేటు పాఠశాలలో టెన్త్ చదువుతున్న నిఖిత (16)కు ఆమె తండ్రి ఇటీవల ఓ స్మార్ట్ ఫోన్ కొనిచ్చాడు. బుధవారం తన సోదరుడితో మాట్లాడిన తరువాత ఆమె తన ఫోన్ ను పొగొట్టుకుంది. దీంతో తీవ్ర ఉద్వేగానికి గురైన ఆమె, నిన్న తన ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తమ బిడ్డను విగతజీవిగా చూసి నిఖిత తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేపట్టారు.

Karnataka
Sucide
Nikitha
Smart Phone
Missing
  • Loading...

More Telugu News