Danam Nagender: దానం కోసం రంగంలోకి దిగిన కేటీఆర్... మెట్టుదిగి సర్దుకున్న విజయారెడ్డి!

  • ఖైరతాబాద్ బరిలో టీఆర్ఎస్ అభ్యర్థిగా దానం
  • విజయారెడ్డిని బుజ్జగించిన కేటీఆర్
  • రెబల్ గా దిగాలన్న ఆలోచన విరమణ

ఖైరతాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ మంత్రి దానం నాగేందర్ పేరును ఖరారు చేసిన తరువాత, ఇదే స్థానాన్ని ఆశించిన దివంగత నేత పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి అలకబూనగా, కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగి ఆమెను బుజ్జగించారు. దీంతో మెట్టుదిగిన ఆమె, రెబల్ గా బరిలోకి దిగరాదని నిర్ణయించుకున్నారు.

ఎన్నో ఆలోచించి దానం నాగేందర్ కు సీటు ఖరారు చేశామని, మీ సేవలను మరో విధంగా వినియోగించుకుంటామని కేటీఆర్ చెప్పడంతో, ఆమె తన మనసు మార్చుకున్నారు. కేటీఆర్ స్వయంగా విజయారెడ్డితో మాట్లాడిన వెంటనే, దానం ఆమె ఇంటికి వెళ్లారు. తనకు మద్దతివ్వాలని కోరారు. దీనికామె అంగీకరించారు. దీంతో ఖైరతాబాద్ విషయంలో టీఆర్ఎస్ లో నెలకొన్న సంక్షోభం తొలగినట్లయింది.

Danam Nagender
Vijayareddy
KTR
Hyderabad
Telangana
Elections
Khairatabad
  • Loading...

More Telugu News