jagan: కోడికత్తి దాడి తర్వాత తొలిసారి కోర్టుకు హాజరైన జగన్

  • కోడికత్తితో దాడి తర్వాత వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకున్న జగన్
  • నాలుగు రోజుల క్రితమే పాదయాత్ర పున:ప్రారంభం
  • కోర్టు వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసిన పోలీసులు

అక్రమాస్తుల కేసులో వైసీపీ అధినేత జగన్ హైదరాబాదులోని సీబీఐ కోర్టుకు నేడు హాజరయ్యారు. విశాఖ విమానాశ్రయంలో తనపై శ్రీనివాస్ అనే యువకుడు కోడికత్తితో దాడి చేసిన తర్వాత... వైద్యుల సూచన మేరకు జగన్ విశ్రాంతి తీసుకున్నారు. నాలుగు రోజుల క్రితం విజయనగరం జిల్లాలో పాదయాత్రను మళ్లీ పున:ప్రారంభించారు. ఈ రోజు శుక్రవారం కావడంతో... కోర్టుకు ఆయన హాజరయ్యారు. మరోవైపు, కోర్టు వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. 

jagan
cbi
court
  • Loading...

More Telugu News