New Delhi: ముగ్గురు గర్ల్ ఫ్రెండ్స్ ను మేనేజ్ చేయాలట... దొంగగా మారిన డ్యాన్సర్!

  • న్యూఢిల్లీలోని గోవింద్ పూర్ లో ఘటన
  • ఆటో డ్రైవర్ వద్ద దొంగతనం
  • పారిపోతుంటే పట్టుకున్న పోలీసులు

తనకున్న ముగ్గురు స్నేహితురాళ్లను సంతృప్తి పరిచేందుకు, వారికి అవసరమైన కానుకలు ఇచ్చేందుకు ఓ నృత్య కళాకారుడు దొంగగా మారి అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన న్యూఢిల్లీలోని గోవింద్ పూర్ లో జరిగింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, ఇదే ప్రాంతంలో నివసించే రోహన్ గిల్ డ్యాన్సర్ గా పనిచేస్తున్నాడు.

నిన్న ఓ ఆటోడ్రైవర్, తన రోజువారీ సంపాదనను లెక్కించుకుంటుండగా, రోహన్, వాటిని లాక్కుని పరుగు ప్రారంభించాడు. దీంతో ఆ ఆటో డ్రైవర్ కేకలు పెడుతూ, అతని వెనకాలే పరిగెత్తుతుండగా, అదే దారిలో వెళుతున్న పెట్రోలింగ్ వాహనంలోని పోలీసులు దొంగను గమనించి బంధించారు. అతని నుంచి రూ. 1,900, మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు.

విచారణలో భాగంగా, తనకు ముగ్గురు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని, వారితో కలసి ఎంజాయ్ చేసేందుకు చాలినంత డబ్బు లేక, దొంగతనాలు చేస్తున్నానని నిందితుడు వెల్లడించినట్టు పోలీసు అధికారి తెలిపారు. అతన్ని రిమాండుకు పంపినట్టు వెల్లడించారు.

New Delhi
Arrest
Theft
Dancer
Girl Friends
  • Loading...

More Telugu News