Anantapur District: చంద్రబాబు చాలా తెలివైన వారు: మాజీ సీఎం నల్లారి కీలక వ్యాఖ్యలు

  • రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే రాష్ట్రానికి మేలు
  • ఈ విషయాన్ని చంద్రబాబు గ్రహించారు
  • ఏ జట్టులో ఉంటారో జగన్, పవన్ తేల్చుకోవాలి
  • గుత్తిలో నల్లారి కిరణ్ కుమార్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చాలా తెలివైన వారని, రాష్ట్రానికి మేలు జరగాలంటే, రాహుల్ గాంధీతో స్నేహం తప్పదని ఆయన తెలుసుకున్నారని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. జరిగిపోయిన విభజనకన్నా, జరగాల్సిన అభివృద్ధి గురించి ప్రజలు ఆలోచించాలని అన్నారు. ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డితో కలసి అనంతపురం జిల్లా గుత్తిలో ఇందిరమ్మ, రాజీవ్ విగ్రహాలను ఆవిష్కరించిన ఆయన, అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

చంద్రబాబు దూరదృష్టితో కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారని అభినందించారు. వైఎస్ఆర్ సీపీ, పవన్ కల్యాణ్ పార్టీలు ఏ జట్టులో ఉంటాయో తేల్చుకోవాలని, కాంగ్రెస్ వైపు కాకుండా, బీజేపీ వైపు వారుంటే, రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం చేసినట్టేనని చెప్పారు. ప్రజలకు మేలు జరగాలంటే, కేంద్రంలో కాంగ్రెస్ ఉండాలని అన్నారు. రాహుల్ ప్రధాని అయితే, ఏపీకి మేలు కలుగుతుందని, ఆ నమ్మకం చంద్రబాబుకు కలిగిందని, ఈ విషయంలో పవన్, జగన్ ఆలోచించుకుని రాష్ట్రానికి మంచి జరిగేలా నిర్ణయం తీసుకోవాలని సలహా ఇచ్చారు.

Anantapur District
Gutti
Nallari
Kiran Kumar Reddy
Raghuveera Reddy
Chandrababu
Jagan
Pawan Kalyan
  • Loading...

More Telugu News