Telangana: పొత్తును నిరసిస్తూ.. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ అధికార ప్రతినిధి రోశిరెడ్డి రాజీనామా!

  • కాంగ్రెస్-టీడీపీ పొత్తును వ్యతిరేకిస్తూ నిర్ణయం
  • తన మనసు అంగీకరించడం లేదని వెల్లడి
  • పదవితో పాటు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా

తెలంగాణ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. తాజాగా టీడీపీ-కాంగ్రెస్ పొత్తును నిరసిస్తూ టీపీసీసీ అధికార ప్రతినిధి రోశిరెడ్డి రాజీనామా సమర్పించారు. ఈ విషయమై రోశిరెడ్డి మాట్లాడుతూ..టీడీపీతో కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్న అనైతిక పొత్తు తనను తీవ్రంగా కలచివేసిందని తెలిపారు. గత 35 సంవత్సరాలుగా పోరాడిన టీడీపీతో ఇప్పుడు జతకట్టేందుకు తన మనసు అంగీకరించడం లేదన్నారు. పార్టీ అధిష్ఠానంతో పాటు టీపీసీసీ నేతల వ్యవహారశైలిని నిరసిస్తూ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పదవులకు రాజీనామా సమర్పించినట్లు పేర్కొన్నారు.

Telangana
Congress
tpcc
rosi reddy
Telugudesam
resign
Congress-Telugudesam alliangence
  • Loading...

More Telugu News