Hari krishna: కూకట్‌పల్లి టికెట్ హరికృష్ణ కుమార్తెకే.. ఖరారు చేసిన టీడీపీ అధిష్ఠానం

  • శనివారం నామినేషన్ వేయనున్న సుహాసిని
  • గురువారం విశాఖలో చంద్రబాబుతో భేటీ
  • మందాడి, పెద్దిరెడ్డిలకు మరో రకంగా న్యాయం చేస్తానని బాబు హామీ

ఎడతెగని మంతనాల తర్వాత కూకట్‌పల్లి టికెట్ హరికృష్ణ కుమార్తె సుహాసినికి ఖరారు చేస్తూ టీడీపీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. ఫలితంగా రెండు రోజులుగా జరుగుతున్న చర్చకు ఫుల్‌స్టాప్ పడింది. గురువారం ఆమె విశాఖపట్టణంలో చంద్రబాబును కలిసి చర్చించారు. సుహాసిని విజయం కోసం అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని ఈ సందర్బంగా తనను కలిసిన నేతలకు చంద్రబాబు సూచించారు. సుహాసిని శనివారం కూకట్‌పల్లిలో నామినేషన్ వేయనున్నారు. కూకట్‌పల్లి టికెట్ ఆశించిన కేపీహెచ్‌బీ కార్పొరేటర్ మందాడి  శ్రీనివాసరావు, పెద్దిరెడ్డిలకు మరో రకంగా న్యాయం చేస్తాని చంద్రబాబు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.

Hari krishna
NTR
Suhasini
Kukatpally
Telangana
Elections
Hyderabad
Telugudesam
  • Loading...

More Telugu News