Telugudesam: ‘కాంగ్రెస్’ జెండా దిమ్మె ధ్వంసం.. టీడీపీకి ఎవరితో ఓట్లేసి గెలిపిస్తారో గెలిపించుకోండి: కార్తీక్ రెడ్డి

  • కార్తీక్ రెడ్డి అనుచరుల హంగామా
  • శంషాబాద్ లోని ‘కాంగ్రెస్’ దిమ్మె పగలగొట్టిన వైనం
  • ఈ నెల 19 లోపు నాకు బీఫాం ఇవ్వాలి

శంషాబాద్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి అనుచరులు హంగామా చేశారు. పార్టీ జెండా దిమ్మెను ధ్వంసం చేసి, అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తీసి పారేశారు. రాజేంద్రనగర్ టికెట్ ఆశించి భంగపడ్డ కార్తీక్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.

 ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ నాయకులకు తాము చెప్పాల్సినదంతా చెప్పామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తనకు బీఫాం ఇస్తే రాజీనామాను ఆమోదించనట్టని, ఒకవేళ బీఫాం ఇవ్వకపోతే రాజీనామాను అంగీకరించినట్టని అన్నారు. ఈ నెల 19వ తేదీ లోపు తనకు బీఫాం ఇవ్వకపోతే ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగుతానని వెల్లడించారు. ఈ నియోజకవర్గంలో టీడీపీకి ఎవరితో ఓట్లేసి గెలిపించుకుంటారో గెలిపించుకోండంటూ సవాల్ విసిరారు.

Telugudesam
Congress
karthik reddy
shamshabad
  • Loading...

More Telugu News