Instagram: 'మీ పెళ్లి ఫోటోల కోసం వేచి చూసి ఇలా మారిపోయారు': దీప్ వీర్ లపై కామెంట్ చేస్తూ అస్థిపంజరాన్ని చూపించిన స్మృతీ ఇరానీ!

  • బయటకు రాని దీపిక, రణ్ వీర్ పెళ్లి ఫోటోలు
  • తనదైన శైలిలో స్పందించిన స్మృతీ ఇరానీ
  • వేల కొద్దీ లైక్స్ తెచ్చుకున్న పోస్టు

అత్యంత రహస్యంగా, కనీసం ఒక్క ఫోటో కూడా అధికారికంగా బయటకు రాకుండా, ఇటలీలో నిన్న డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకున్న బాలీవుడ్ సెలబ్రిటీ జంట దీపికా పదుకొనే, రణ్ వీర్ సింగ్ లపై కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ తనదైన శైలిలో స్పందించారు. పెళ్లికి సంబంధించిన ఫోటోలు బయటకు వెళ్లకుండా వీరిద్దరూ ఎన్నో జాగ్రత్తలు తీసుకోగా, వీరి వివాహ చిత్రాలు చూడాలని ఫ్యాన్స్ తహతహలాడుతున్నారు.

ఈ నేపథ్యంలో స్మృతీ ఇరానీ స్పందిస్తూ, "దీప్‌వీర్‌ పెళ్లి ఫొటోల కోసం చాలా సేపటి వరకు ఎదురుచూసినప్పుడు ఇలాగే ఉంటుంది" అంటూ ఓ బల్లపై కూర్చున్న అస్థిపంజరం ఫోటోను పోస్టు చేశారు. స్మృతిలోని హాస్య చతురతను అభినందిస్తూ, ఈ పోస్టుకు వేలకొద్దీ లైక్స్ వచ్చాయి. వీరి పెళ్లి ఫోటోలు విడుదల చేస్తే చూడాలని సినీ ప్రముఖులతో పాటు కోట్లాది మంది ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. కాగా, నిన్న కొంకణి సంప్రదాయంలో ఒకటైన ఈ జంట, నేడు సింధీ సంప్రదాయంలో వివాహం చేసుకోనున్న సంగతి తెలిసిందే.

Instagram
Smruti Irani
Deepika Padukone
Ranveer singh
Marriage
Photos
Italy
  • Loading...

More Telugu News