India: రిపోర్టర్ అవతారం ఎత్తి ఫిజియోకు ముద్దు పెట్టిన చాహల్!

  • వెస్టిండీస్ పై విజయం సాధించిన భారత్
  • బస్సులో వెళుతూ రిపోర్టర్ గా మారి సహచరులకు ప్రశ్నలు
  • ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసుకున్న బీసీసీఐ

భారత స్పిన్నర్ యజువేంద్ర చాహల్ వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వెస్టిండీస్ తో టీ-20 సిరీస్ ముగిసిన తరువాత, ఆటగాళ్లంతా ఓ బస్సులో వెళుతున్నప్పుడు జరిగిన ఘటన ఇది. బస్సులో కాసేపు సరదాగా రిపోర్టర్ అవతారం ఎత్తిన చాహల్, సహచర ఆటగాళ్లను ప్రశ్నిస్తూ, ఫిజియో తలను నిమురుతూ ముద్దిచ్చాడు.

అంతకుముందు వెస్టిండీస్ తో పోటీలో అనుభవాన్ని, అభిప్రాయాలను చెప్పాలని రోహిత్ శర్మ, ధావన్, పాండే, రిషబ్ పంత్ లతో పాటు కోచ్ సంజయ్ బంగర్ లను సరదాగా ఇంటర్వ్యూ చేశాడు. ఫిజియో తలపై ముద్దు పెట్టిన తరువాత, ఆటగాళ్లంతా పెద్దపెట్టున నవ్వారు. ఆ వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పంచుకోవడంతో, అది కాస్తా వైరల్ అయింది. 

India
Westindees
Chahal
BCCI
Video
Reporter
Kiss
  • Loading...

More Telugu News