charan: చిరూ తరువాత కొరటాల మూవీ చరణ్ తోనే!

  • చిరూ సినిమా కోసం కొరటాల కసరత్తు 
  • జనవరిలో షూటింగ్ ప్రారంభం 
  • అడ్వాన్స్ ఇచ్చిన చరణ్

'సైరా' సినిమా తరువాత కొరటాల శివతో కలిసి చిరంజీవి సెట్స్ పైకి వెళ్లనున్నారు. ఈ సినిమాకి సంబంధించిన అన్ని పనులను చక్కబెట్టడంలో కొరటాల బిజీగా వున్నాడు. జనవరి నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో చిరంజీవి రైతు పాత్రలో కనిపించనున్నారట. ఈ సినిమాకి నిర్మాతగా చరణ్ పేరే వినిపిస్తోంది.

ఈ సినిమా తరువాత కొరటాల చేయబోయే మూవీ చరణ్ తోనే అని అంటున్నారు. ఇటు చిరంజీవి సినిమాకి సంబంధించి .. ఆ తరువాత తనతో చేయనున్న సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ ను కొరటాలకి చరణ్ ఇవ్వడం జరిగిపోయిందని చెబుతున్నారు. చిరూతో కొరటాల .. రాజమౌళితో చరణ్ ప్రాజెక్టులు పూర్తయ్యాక ఈ సినిమా ఉంటుందన్న మాట.   

  • Loading...

More Telugu News