Varalakshmi Sarat Kumar: పెళ్లయితే ఒకరి మొహమే చూస్తుండాలి: వరలక్ష్మీ శరత్ కుమార్ సంచలన వ్యాఖ్యలు

  • పెళ్లి చేసుకుని ఏం సాధిస్తారు?
  • ఒంటరిగా ఉన్న పురుషులను పెళ్లి గురించి అడగరేం?
  • నెట్టింట దుమారాన్ని రేపుతున్న వ్యాఖ్యలు

వివాహ వ్యవస్థపై నటి వరలక్ష్మీ శరత్ కుమార్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట దుమారాన్ని రేపుతుండగా, ఆమెను పలువురు ట్రోల్ చేస్తున్నారు. ఇటీవల ఓ టీవీ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె, పెళ్లి చేసుకోవడం అంటే సమయం వృథా చేసుకోవడమేనని, పెళ్లయితే, నిత్యమూ ఒకే మొహాన్ని చూస్తూ కూర్చోవాల్సి వస్తుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిందామె.

పెళ్లి చేసుకోవాలన్న కోరిక ఎవరికి ఉండదని చెప్పిన ఆమె, రాజకీయాల్లోకి రావాలనో, ఓ మంచి పని చేయాలనో లక్ష్యంగా నిర్ణయించుకుంటే బాగుంటుందే తప్ప, పెళ్లి చేసుకుని ఏం సాధించగలరని వరలక్ష్మీ ప్రశ్నించింది. ఎవరినైనా ప్రేమించాలని అనుకుంటే ఓకేనని, అదే పెళ్లంటే మాత్రం వేస్టని చెప్పింది. ఒత్తిడి వల్లే పెళ్లిళ్లు జరుగుతున్నాయని, మగవాళ్లు ఒంటరిగా ఉంటే అడగని వారు, యువతి ఒంటరిగా ఉంటే మాత్రం వచ్చి పెళ్లి గురించి అడుగుతూ ఉంటారని అంది.

తనకు ప్రేమించాలన్న ఫీలింగ్ చాలాసార్లు వచ్చి, పోయిందని, తనను వివాహం చేసుకున్నవాడు తన జాబ్ ని వదులుకోకుంటే, అతని కోసం తానెందుకు త్యాగాలు చేయాలని ప్రశ్నించింది. వరలక్ష్మి వ్యాఖ్యలపై పలువురు మండిపడుతున్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News