Uttam Kumar Reddy: నేడే తుది జాబితా... తుది కసరత్తుకు కూర్చున్న ఉత్తమ్!

  • న్యూఢిల్లీలోనే మకాం వేసిన ఉత్తమ్
  • ఏఐసీసీ నేతలతో భేటీ
  • సాయంత్రానికి తుది లిస్టు!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను కాంగ్రెస్ నేడు విడుదల చేయనుంది. న్యూఢిల్లీలో మకాం వేసిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ నేతలతో కలిసి తుది జాబితాపై కసరత్తు ప్రారంభించారు. నేటి మధ్యాహ్నానికి లిస్టును ఫైనల్ చేసి, సాయంత్రంలోగా ప్రకటిస్తారని తెలుస్తోంది.

కాగా, ఈ ఎన్నికల్లో నామినేషన్ దాఖలుకు మరో నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ నాలుగు రోజుల్లోనూ ఒక రోజు ఆదివారం కావడంతో, మూడు రోజులే ఉన్నట్టు లెక్క. ఇప్పటికింకా అభ్యర్థుల జాబితా ఫైనల్ కాకపోవడం, 75 పేర్లను మాత్రమే ప్రకటించడంతో, పెండింగ్ సీట్లలోని ఆశావహులు ఆత్రుతతో ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది.

అభ్యర్థుల జాబితాను సాధ్యమైనంత త్వరగా విడుదల చేసి, తాను కూడా హైదరాబాద్ చేరుకుని ప్రచార రంగంలోకి దిగుతానని ఈ ఉదయం ఉత్తమ్ వ్యాఖ్యానించారు. టికెట్ దక్కని వారు అసంతృప్తికి గురికావాల్సిన అవసరం లేదని, వారి అర్హతను బట్టి సముచిత స్థానం ఇస్తామని ఆయన అన్నారు.

Uttam Kumar Reddy
Telangana
AICC
Elections
  • Loading...

More Telugu News