Mao: కిడారి తరహాలో చందూలాల్ ను హతమార్చేందుకు ప్లాన్... తృటిలో తప్పించుకున్న వైనం!

  • పొలంలో మావోయిస్టుల షెల్టర్
  • ఇద్దరి అరెస్టుతో పోలీసులకు తెలిసిన విషయం
  • హెచ్చరించడంతో వెనుదిరిగిపోయిన ఎమ్మెల్యే

ఏజన్సీలో అరకు ఎమ్మెల్యే కిడారి సోమను హత్య చేసినట్టుగానే, తెలంగాణ ఎమ్మెల్యే చందూలాల్ ను హత్య చేసేందుకు మావోయిస్టులు వేసిన ప్లాన్ భగ్నమైంది. చందూలాల్ ను చంపాలన్న ఉద్దేశంతో 30 మంది మావోయిస్టులు పొంచి వున్నారని తెలంగాణ ఇంటెలిజెన్స్ విభాగం పసిగట్టి ఆయన్ను అప్రమత్తం చేసింది.

మావోయిస్టులకు షెల్టర్ ఇచ్చారన్న ఆరోపణలపై ఇద్దరు స్థానికులను పోలీసులు అరెస్ట్ చేశారు. పద్మాకర్ మండలంలో ఆయన్ను అటాక్ చేసే ఆలోచనలో మావోయిస్టులు ఉన్నారన్న విషయం వీరి విచారణలో తెలిసింది. దీంతో చందూలాల్ ను అలర్ట్ చేయడంతో ఆయన కటాపూర్ లో ప్రచారం నిర్వహించుకుని గిరిజన గ్రామాలకు వెళ్లకుండానే వెనుదిరిగిపోయారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Mao
Chandulal
Telangana
Murder Plan
  • Loading...

More Telugu News