Kodad: ఇంకా ఇద్దరి పేర్లు చెప్పని కేసీఆర్... ఉత్కంఠ!

  • ఇంకా ఖరారు కాని కోదాడ, ముషీరాబాద్
  • ముషీరాబాద్ ను తన అల్లుడికి కోరుతున్న నాయిని
  • సాయంత్రానికి ప్రకటించే అవకాశం

అసెంబ్లీని రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన నాడే, ముందస్తు ఎన్నికల్లో పోటీ చేయబోయే 105 మంది పేర్లను వెల్లడించి సంచలనాన్ని సృష్టించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, నామినేషన్ దాఖలుకు మరో నాలుగు రోజుల సమయం మాత్రమే ఉన్నప్పటికీ మరో రెండు స్థానాల్లో ఎవరిని నిలపాలో తేల్చుకోలేక పెండింగ్ లో ఉంచారు. తొలుత 105, ఆపై 2 సీట్లలో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేసిన కేసీఆర్, గత రాత్రి మరో 10 మంది పేర్లు వెల్లడించడంతో, టీఆర్ఎస్ తరఫున పోటీ పడే 117 మంది ఎవరో తేలిపోయింది.

ఇంకా అభ్యర్థిని తేల్చని నియోజకవర్గాలు కోదాడ, ముషీరాబాద్. ఈ రెండు స్థానాల్లో ఎవరిని నిలబెడతారన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ముషీరాబాద్ స్థానాన్ని తన అల్లుడికి ఇవ్వాలని నాయిని నర్సింహారెడ్డి కోరుతున్నారు. కాగా, ఈ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసే వారి పేర్లను సాయంత్రానికి ప్రకటిస్తారని తెలుస్తోంది.

Kodad
Musheerabad
Telangana
Elections
  • Loading...

More Telugu News