Mallu Bhatti Vikramarka: 75 నుంచి 80 స్థానాల్లో మా గెలుపు ఖాయం: భట్టి విక్రమార్క ధీమా

  • రేపటి నుంచి ప్రచారం వేగవంతం చేస్తాం
  • పది బహిరంగ సభల్లో రాహుల్, సోనియా పాల్గొంటారు
  • టికెట్లు దక్కని వారికి భవిష్యత్ లో సముచిత స్థానం

తెలంగాణలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని, తమకు 75 నుంచి 80 స్థానాలు వస్తాయని ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ మల్లు భట్టి విక్రమార్క మరోసారి ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. రేపటి నుంచి తమ ప్రచారాన్ని వేగవంతం చేస్తామని చెప్పారు.

ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న బహిరంగ సభలలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్, సోనియాగాంధీలు పాల్గొంటారని, మొత్తం పది సభలలో వారు ప్రసంగించనున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా అభ్యర్థులకు టికెట్ల విషయమై ఆయన మాట్లాడుతూ, సాధ్యమైనంత వరకు సామాజిక న్యాయం పాటిస్తామని చెప్పారు. టికెట్లు దక్కని అభ్యర్థులను భవిష్యత్ లో సముచిత స్థానంతో గౌరవిస్తామని చెప్పారు. కూటమి ఏర్పాటు కాదనుకున్న టీఆర్ఎస్ కు అది ఏర్పడంతో దిమ్మతిరిగిపోయిందని విమర్శించారు.

Mallu Bhatti Vikramarka
mahakutami
gandhibhavan
  • Loading...

More Telugu News