t-Telugudesam: టీ-టీడీపీ రెండో జాబితా విడుదల

  • ఇద్దరు అభ్యర్థులతో జాబితా విడుదల
  • ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి సామ రంగారెడ్డి
  • రాజేంద్రనగర్ నుంచి గణేశ్ గుప్తా

తెలంగాణలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో టీ-టీడీపీ రెండో జాబితా విడుదలైంది. మహాకూటమితో పొత్తులో ఉన్న టీ-టీడీపీ ఇద్దరు అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ అధిష్ఠానం విడుదల చేసింది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి సామ రంగారెడ్డి, రాజేంద్రనగర్ నుంచి గణేశ్ గుప్తా పేర్లను ఈ జాబితా ద్వారా ప్రకటించింది. కాగా, టీ-టీడీపీ ఇప్పటికే విడుదల చేసిన తొలి జాబితాలో 9 మంది అభ్యర్థులను ప్రకటించింది.

ఇదిలా ఉండగా, మూడో రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఇవాళ ఒక్కరోజే 334 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఈరోజు దాఖలైన మొత్తం నామినేషన్ల సంఖ్య 417 కాగా, గత మూడు రోజుల్లో దాఖలైన మొత్తం నామినేషన్ల సంఖ్య 504 కావడం గమనార్హం.

t-Telugudesam
mahakutami
second list
  • Loading...

More Telugu News