KCR: కేసీఆర్‌కు దమ్ముంటే కొండగల్ నుంచి పోటీ చేయాలి: రేవంత్ రెడ్డి సవాల్

  • ఇద్దరు ఎంపీలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధం
  • కేసీఆర్‌కు చేతనైతే ఆ ఇద్దరు ఎంపీలను ఆపాలి
  • ప్రజలు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి సవాళ్లు విసిరారు. బుధవారం నామినేషన్ దాఖలు చేసిన అనంతరం నియోజకవర్గ స్థాయి కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్‌కు చెందిన ఇద్దరు ఎంపీలు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నారని, కేసీఆర్‌కు చేతనైతే అసెంబ్లీ ఎన్నికల లోపు ఆ ఇద్దరు ఎంపీలను ఆపాలని సవాల్ విసిరారు. ఆయనకు దమ్ముంటే కొడంగల్ నుంచి పోటీ చేయాలన్నారు.

నామినేషన్ వేసేందుకు ఇంకా సమయం ఉంది కాబట్టి త్వరగా నిర్ణయం తీసుకోవాలని కేసీఆర్‌కు సూచించారు. ఏనాడూ తాను కొండగల్ ప్రజల ఆత్మగౌరవానికి భంగం కలిగించలేదని.. ప్రజలు తనను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారని అన్నారు. అందుకే తాను గెలవడం ఖాయమని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు.

KCR
Congress
Revanth Reddy
KOdangal
Assembly elections
  • Loading...

More Telugu News