Gali Janardhan Reddy: గాలి జనార్దన్‌రెడ్డికి బెయిల్ మంజూరు

  • ప్రజలను మోసం చేసి డబ్బు వసూలు చేసిన అంబిడెంట్
  • కేసు నుంచి తప్పించేందుకు రూ.20 కోట్లతో డీల్
  • ముందస్తు బెయిల్‌కు నిరాకరించిన న్యాయస్థానం

మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి బెయిలు మంజూరైంది. ప్రజలను మోసం చేసి డబ్బు వసూలు చేసిన అంబిడెంట్ మార్కెటింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీని ఈడీ కేసు నుంచి తప్పించేందుకు గాలి జనార్దన్ రెడ్డి రూ.20 కోట్లకు డీల్ కుదుర్చుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో కొన్ని గంటల పాటు ప్రశ్నించిన అనంతరం గాలితో పాటు ఆయన పీఏ అలీఖాన్‌ను కర్ణాటక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టుకు ముందే కేసు నుంచి తప్పించుకునేందుకు ముందస్తు బెయిల్‌కు గాలి యత్నించినా న్యాయస్థానం నిరాకరించింది. ఎట్టకేలకు ఆయనకు లక్ష రూపాయల పూచీకత్తులో నేడు బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం అంగీకరించింది.

Gali Janardhan Reddy
Ambident company
Bail
Karnataka Police
Court
  • Loading...

More Telugu News