Telangana: తెలంగాణలో 3 స్థానాలకు సీపీఐ అభ్యర్థుల ప్రకటన

  • హుస్నాబాద్ - చాడ వెంకట్ రెడ్డి
  • బెల్లంపల్లి- గుండా మల్లేశ్
  • వైరా- బానోతు విజయబాయ్

తెలంగాణలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సీపీఐ తమ అభ్యర్థులను ప్రకటించింది. మహాకూటమిలో భాగస్వామ్య పార్టీ అయిన సీపీఐ తమకు కేటాయించిన మూడు స్థానాల్లో అభ్యర్థుల వివరాల జాబితాను ప్రకటించింది. హుస్నాబాద్ నియోజకవర్గం అభ్యర్థిగా చాడ వెంకట్ రెడ్డి, బెల్లంపల్లి నుంచి గుండా మల్లేశ్, వైరా నుంచి బానోతు విజయబాయ్ పోటీ చేస్తారని రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. కాగా, బెల్లంపల్లి అభ్యర్థి ఎవరన్న విషయమై ఆఖరి క్షణం వరకు పార్టీలో చర్చ జరిగింది. ఎట్టకేలకు గుండా మల్లేశ్ పేరును ఖరారు చేసింది.

Telangana
cpi
mahakutami
  • Loading...

More Telugu News