Andhra Pradesh: జగన్ ను ఓడించడానికి చంద్రబాబు పవన్ కల్యాణ్ కాళ్లు పట్టుకున్నారు!: వైసీపీ నేత రోజా

  • ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారు
  • జగన్ దాడిపై వెకిలి నవ్వులు నవ్వారు
  • చంద్రబాబుపై ఎమ్మెల్యే రోజా ఫైర్

2014 అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ నేతృత్వంలోని వైసీపీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికి సీఎం చంద్రబాబు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాళ్లు పట్టుకున్నారని వైసీపీ నేత, ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం జరిగితే పరామర్శించడం మానేసి చంద్రబాబు వెకిలి నవ్వులు, పిచ్చి నవ్వులు నవ్వారని మండిపడ్డారు. తెలుగు పప్పుకు తోడుగా ఇప్పుడు జాతీయ స్థాయి మరోపప్పు రాహుల్ చేరారని ఎద్దేవా చేశారు.

తెలుగు ప్రజలను మోసం చేసి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని రోజా ఆరోపించారు. చంద్రబాబుతో చేతులు కలిపిన రాహుల్ గాంధీ.. బాబు ఇచ్చిన వీణను వాయించుకుంటూ కూర్చోవాల్సిందేనని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో వైసీపీ అధికారంలోకి వస్తుందని ఆమె జోస్యం చెప్పారు.

Andhra Pradesh
Chandrababu
Jagan
Pawan Kalyan
roja
YSRCP
Jana Sena
Telugudesam
cheat
  • Loading...

More Telugu News