kcr: గజ్వేల్ లో నామినేషన్ దాఖలు చేసిన కేసీఆర్

  • గజ్వేల్ ఆర్డీవోకు నామినేషన్ పత్రాల అందజేత
  • 2.34 గంటలకు నామినేషన్ పత్రాల సమర్పణ
  • కేసీఆర్ వెంట హరీశ్ రావుతో పాటు మరో ముగ్గురు

గజ్వేల్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. గజ్వేల్ ఆర్డీవో కార్యాలయానికి హరీష్ రావుతో పాటు మరో ముగ్గురితో కలిసి ఆయన వెళ్లినట్టు సమాచారం. ముందుగా నిర్ణయించుకున్న ముహూర్తం ప్రకారం ఈరోజు మధ్యాహ్నం 2.34 గంటలకు నామినేషన్ పత్రాలను కేసీఆర్ సమర్పించారు. కాగా, ఎటువంటి ఆర్భాటం లేకుండా సాదాసీదాగా కేసీఆర్ నామినేషన్ కార్యక్రమం జరిగింది. అంతకుముందు, కోనాయిపల్లిలోని శ్రీవేంకటేశ్వరస్వామికి కేసీఆర్, హరీశ్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

kcr
gajvel
election nomination
  • Loading...

More Telugu News