sabarimala: 17న శబరిమల ఆలయానికి వెళ్తున్న తృప్తి దేశాయ్.. రిజిస్టర్ చేయించుకున్న 500 మంది మహిళలు!

  • శబరిమలకు వెళ్తున్న భూమాత బ్రిగేడ్ వ్యవస్థాపకురాలు తృప్తి దేశాయ్
  • రక్షణ కల్పించాలంటూ కేరళ ముఖ్యమంత్రికి లేఖ
  • వేడెక్కనున్న శబరిమల పరిసర ప్రాంతాలు

శబరిమల ఆలయ పరిసర ప్రాంతాలు మరోసారి వేడెక్కనున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో, ఇప్పటికే పలువురు మహిళలు అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించేందుకు యత్నించి... ఆందోళనకారుల నిరసనలతో వెనుదిరిగిన సంగతి తెలిసిందే. తాజాగా భూమాత బ్రిగేడ్ వ్యవస్థాపకురాలు తృప్తి దేశాయ్ శబరిమలకు వెళుతున్నారు. ఈ విషయాన్ని ఆమె అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో, తనకు తగినంత రక్షణ కల్పించాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ను ఆమె కోరారు. ఈమేరకు ఆమె సీఎంకు లేఖ రాశారు.

రెండు నెలల పాటు శబరిమలలో కొనసాగే 'మండల మక్కరవిళ్లక్కు' నవంబర్ 17 నుంచి ప్రారంభం కాబోతోంది. ఇదే సమయంలో తృప్తి దేశాయ్ శబరిమలకు వెళ్లనున్నారు. మరోవైపు, మరో 500 మంది యువతులు కూడా అయ్యప్ప దర్శనం కోసం ఆన్ లైన్ క్యూ వెబ్ సైట్లో రిజిస్టర్ చేయించుకున్నారు. ఈ నేపథ్యంలో, మరోసారి అలజడి చెలరేగుతోంది.

sabarimala
trupti desai
bhumata brigade
  • Loading...

More Telugu News