Ganta Srinivasa Rao: ఇలా అయితే పవన్ నాయకుడు కాలేరు.. జగన్ కు ప్రతిపక్ష హోదా కూడా రాదు: గంటా

  • ఓ పార్టీ అధినేతగా పవన్ వ్యవహరించడం లేదు
  • రాఫెల్ కుంభకోణంపై జగన్, పవన్ లు ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు
  • జగన్ కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదు

ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ లను చదువుతూ పోతే... జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నటికీ నాయకుడు కాలేరని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఓ పార్టీ అధినేతగా పవన్ వ్యవహరించడం లేదని ఎద్దేవా చేశారు. రాఫెల్ స్కామ్ యావత్ దేశాన్ని కుదిపేస్తోందని... దానిపై పవన్, జగన్ లు ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని విమర్శించారు. ఆంధ్ర ప్రజలు, వ్యవస్థలపై జగన్ కు నమ్మకం లేదని... అనుభవం లేదని జగన్ ను ప్రజలు కూడా నమ్మడం లేదని చెప్పారు. జగన్ తన వైఖరిని మార్చుకోకపోతే... మిగిలిన నేతలు కూడా పార్టీని వదిలి వెళ్తారని అన్నారు. రానున్న ఎన్నికల్లో జగన్ కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదని తెలిపారు. వైసీపీ మునిగిపోతున్న పడవలాంటిదని చెప్పారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధిస్తుందని అన్నారు.

Ganta Srinivasa Rao
jagan
Pawan Kalyan
  • Loading...

More Telugu News