Andhra Pradesh: పోలవరం ప్రాజెక్టు పేరుతో దోచుకుంటున్నారు.. వాళ్లను విడిచిపెట్టబోం!: కన్నా లక్ష్మీనారాయణ

  • పోలవరంలో నాణ్యత ప్రమాణాలు గాలికి
  • కాంగ్రెస్ తోనే ఇప్పుడు బాబు అంటకాగారు
  • ప్రభుత్వ భూముల్ని ధారదత్తం చేస్తున్నారు

పోలవరం ప్రాజెక్టులో నాణ్యత ప్రమాణాలు పాటించకుండా సీఎం చంద్రబాబు పనులు చేయిస్తున్నారని ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. అలాంటి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం దోషి అని విమర్శించడం హాస్యాస్పదమన్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీని తిట్టిపోసిన చంద్రబాబు ఇప్పుడు అదే పార్టీతో అంటకాగుతున్నారని ఎద్దేవా చేశారు.

పోలవరం ప్రాజెక్టు పనుల పేరుతో ప్రజా ధనాన్ని దోచుకున్నవారిని విడిచిపెట్టబోమని కన్నా లక్ష్మీనారాయణ ప్రకటించారు. చంద్రబాబు సర్కారు రాజధాని అమరావతి, పోర్టులు, సెజ్ ల పేరుతో ప్రభుత్వ భూములను విచ్చలవిడిగా ప్రైవేటు సంస్థలకు కట్టబెడుతోందని మండిపడ్డారు. ఇందుకు నిరసనగా ఈ నెల 19 నుంచి 24 వరకూ రిలే నిరాహార దీక్షలు చేస్తామని ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబుకు నాయకత్వంలోని టీడీపీకి ఓటమి ఖాయమని కన్నా జోస్యం చెప్పారు.

Andhra Pradesh
polavaram project
quality work
exploit
kanna lakshmi narayana
BJP
Chandrababu
Chief Minister
Telugudesam
  • Loading...

More Telugu News