nakka anandababu: వైసీపీ నేతలు ఆస్కార్‌ రేంజ్‌లో నటిస్తున్నారు: మంత్రి నక్కా ఆనందబాబు ఎద్దేవా

  • రాష్ట్రపతిని కలవడానికి కోడికత్తి అంశం ఏమైనా జాతీయ సమస్యా?
  • జరిగిన ఘటనపై ఇన్నాళ్లయినా జగన్‌ ఎందుకు నోరు మెదపడం లేదు
  • బీజేపీ మతతత్వ పార్టీ కాదని పవన్‌ వ్యాఖ్యానించడం  సిగ్గుచేటు

జగన్‌పై కోడికత్తితో జరిగిన దాడిని ఏదో జాతీయ స్థాయి అంశంలా వైసీపీ నేతలు ఆస్కార్‌ రేంజ్‌లో నటిస్తున్నారని ఆంధ్రప్రదేశ్‌ మంత్రి నక్కా ఆనందబాబు ఎద్దేవా చేశారు. దీనికోసం రాష్ట్రపతిని కలవడం హాస్యాస్పదమన్నారు. బుధవారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తనపై దాడి జరిగి ఇన్ని రోజులవుతున్నా విపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు.

వ్యవస్థలపై నమ్మకంలేని అటువంటి వ్యక్తి విపక్ష నేతగా కూడా అనర్హులన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి విజయసాయిరెడ్డి గూఢచారి అని ఆరోపించారు. వైఎస్‌ కుటుంబం రాయల సీమలో రక్తాన్ని పారిస్తే బాబు నీరు పారిస్తున్నారని చెప్పారు.

ఇక, భారతీయ జనతా పార్టీని మతతత్వ పార్టీ కాదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యానించడం సిగ్గుచేటన్నారు. వీరంతా ఒక్కటి కాబట్టే బీజేపీని పల్లెత్తు మాట అనడం లేదని విమర్శించారు. రాష్ట్రం విషయంలో కాకిగోల చేసే జీవీఎల్‌ కేంద్రంపై కాగ్‌ నివేదికపై మాట్లాడాలని కోరారు.

nakka anandababu
YSRCP
Jana Sena
  • Loading...

More Telugu News