Andhra Pradesh: 297వ రోజుకు చేరుకున్న జగన్ ప్రజా సంకల్ప యాత్ర.. రూట్ మ్యాప్ విడుదల!

  • విజయనగరం జిల్లాలో కొనసాగుతున్న యాత్ర
  • ఉదయం 7.30కు తామరఖండిలో ప్రారంభం
  • ప్రజలను పలకరిస్తూ ముందుకు సాగుతున్న నేత

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ 297వ రోజు ప్రజాసంకల్ప యాత్ర నేడు ప్రారంభమైంది. విజయనగరం జిల్లాలోని పార్వతీపురం నియోజకవర్గంలో ఉన్న తామరఖండి నుంచి ఈరోజు ఉదయం 7.30 గంటలకు జగన్ పాదయాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా జగన్ పాదయాత్ర చినభోగిలి, సీతానగరం, అప్పయ్యపేట వరకూ సాగనుంది. అక్కడ జగన్ మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారు.

అనంతరం జోగింపేట, గుచ్చిమి మీదుగా చిన్నరాయుడుపేట వరకూ ప్రజాసంకల్ప యాత్ర సాగనుంది. ఆ తర్వాత జగన్ అక్కడే విశ్రాంతి తీసుకుంటారు. కాగా, జగన్ ను కలుసుకునేందుకు పాదయాత్ర మార్గంలో భారీగా ప్రజలు గుమిగూడారు. దీంతో అభిమానులు, కార్యకర్తలతో కలిసి ప్రజలను పలకరిస్తూ జగన్ ముందుకు సాగుతున్నారు.

Andhra Pradesh
Jagan
prajasankalpa yatra
Vijayanagaram District
297 day
  • Loading...

More Telugu News