arjun: హీరో అర్జున్ నాపై పెట్టిన కేసును కొట్టివేయండి.. కర్ణాటక హైకోర్టును ఆశ్రయించిన నటి శ్రుతి!

  • అర్జున్ వేధించాడని ఆరోపించిన నటి
  • దృష్టి మళ్లించేందుకే అర్జున్ కేసు పెట్టాడని విమర్శ
  • నేడు అర్జున్ పిటిషన్ ను విచారించనున్న కోర్టు

యాక్షన్ కింగ్ అర్జున్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని నటి శ్రుతి హరిహరణ్ గతంలో ఆరోపించిన సంగతి తెలిసిందే. దీంతో ఆమెపై రూ.5 కోట్ల పరువునష్టం దావాను అర్జున్ దాఖలు చేశాడు. అనంతరం సైబర్ పోలీస్ స్టేషన్ లో ఆమెపై ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో శ్రుతి కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. అర్జున్ తనపై పెట్టిన కేసును కొట్టివేయాలని విజ్ఞప్తి చేసింది. తాను చేసిన ‘మీ టూ’ ఆరోపణల నుంచి అందరి దృష్టి మళ్లించేందుకే అర్జున్ ఈ కేసును పెట్టాడని ఆమె ఆరోపించింది. కాగా, శ్రుతిపై అర్జున్ దాఖలు చేసిన పిటిషన్ నేడు హైకోర్టు ముందు విచారణకు రానుంది.

arjun
hero
sruti hariharan
me too
Casting Couch
Karnataka high court
petition
Police
case
  • Loading...

More Telugu News