Reserve Bank of India: రేపు చలామణిలోకి రానున్న రూ. 12 వేల కోట్ల నగదు!

  • ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య కొరత
  • రంగంలోకి దిగిన ఆర్బీఐ
  • ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేయనున్న రిజర్వ్ బ్యాంక్

భారత ఆర్థిక వ్యవస్థలోకి గురువారం నాడు 12 వేల కోట్ల రూపాయలను విడుదల చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేయడం ద్వారా ఈ డబ్బును చలామణిలోకి తీసుకు రావాలని నిర్ణయించినట్టు ఆర్బీఐ తెలిపింది.

ఆర్థిక సేవల సంస్థ ఐఎల్ అండ్ ఎఫ్ఎస్, గడచిన సెప్టెంబర్ నెలలో డిఫాల్ట్ గా మారడంతో, ఎకానమీలో ద్రవ్య కొరత ఏర్పడిన కారణంగా ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఓపెన్ మార్కెట్ కార్యకలాపాల ద్వారా రూ. 12 వేల కోట్ల విలువైన ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేయనున్నామని, మల్టిపుల్ సెక్యూరిటీ ఆక్షన్ విధానంలో కొనుగోలు ఉంటుందని ఆర్బీఐ ఓ ప్రకటనలో పేర్కొంది.

  • Loading...

More Telugu News