srinu vaitla: సినిమా చేసిపెట్టమని నేను మహేశ్ బాబును అడగలేదు: శ్రీను వైట్ల

  • మహేశ్ బాబు నాకు మంచి స్నేహితుడు 
  • మంచి కథ దొరికితే వినిపిస్తాను 
  • రవితేజ నాకు ట్రబుల్ షూటర్ లాంటివాడు               

శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజ హీరోగా రూపొందిన 'అమర్ అక్బర్ ఆంటోని' .. ఈ నెల 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో శ్రీను వైట్ల బిజీగా వున్నాడు. ''వరుస పరాజయాలు ఎదురవుతూ వుండటంతో ఒక సినిమా చేసిపెట్టమని మీరు మహేశ్ బాబును అడిగినట్టుగా వార్తలు వచ్చాయి .. నిజమేనా?'' అనే ప్రశ్న తాజా ఇంటర్వ్యూలో ఆయనకి ఎదురైంది.

అందుకు శ్రీను వైట్ల స్పందిస్తూ .. ''మహేశ్ బాబు నాకు మంచి ఫ్రెండ్ .. అయినా ఏ రోజు నేను ఆయన దగ్గరికి వెళ్లి సినిమా చేసిపెట్టమని అడగలేదు. ఫ్లాపుల నుంచి బయటపడటం కోసం మాత్రం మహేశ్ బాబు దగ్గరికి వెళ్లను. ఆయనకి తగిన మంచి కథ దొరికితే వినిపిస్తానేమో. రవితేజ మాత్రం నాకు ట్రబుల్ షూటర్ లాంటివాడు. నేను ఇబ్బందుల్లో వున్న ప్రతిసారి నాతో సినిమా చేస్తాడు" అంటూ చెప్పుకొచ్చారు.       

srinu vaitla
Mahesh Babu
raviteja
  • Loading...

More Telugu News