Andhra Pradesh: వైఎస్ జగన్ పై మండిపడ్డ టీడీపీ ఎమ్మెల్యే అనిత!

  • జగన్ పోలీసులకు సహకరించడం లేదు
  • చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారు
  • ఆయనకు ఏడాదిగా ఏపీ పోలీసులే రక్షణ కల్పించారు

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పోలీసుల విచారణకు సహకరించకుండా సీఎం చంద్రబాబుపై విమర్శలు చేయడం దారుణమని టీడీపీ ఎమ్మెల్యే అనిత వ్యాఖ్యానించారు. జగన్ చేస్తున్న కోడికత్తి డ్రామాను ఏపీ ప్రజలందరూ గమనిస్తున్నారని అన్నారు. ఏడాది కాలంగా జగన్ చేస్తున్న ప్రజాసంకల్ప యాత్రకు ఏపీ పోలీసులే రక్షణ కల్పించారని ఆమె గుర్తుచేశారు. ఇప్పుడు కొత్తగా ఆంధ్రా పోలీసులపై నమ్మకం లేదని జగన్ చెప్పడం దారుణమన్నారు.

తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.
పవిత్రమైన తిరుమలలో రాజకీయాలు మాట్లాడటం దారుణమని అనిత సెలవిచ్చారు. కొండపై రాజకీయాలు మాట్లాడేవారిపై ఏపీ ప్రభుత్వం, టీటీడీ చర్యలు తీసుకోవాలని కోరారు. కొండపై రాజకీయాలు మాట్లాడేవారిని స్వామివారి దర్శనానికి అనుమతించరాదని వ్యాఖ్యానించారు.

Andhra Pradesh
Chandrababu
Jagan
anitha
Telugudesam
  • Loading...

More Telugu News