mecha nageswara rao: చంద్రబాబును కలిసి కృతజ్ఞతలు తెలిపిన అశ్వారావుపేట అభ్యర్థి

  • ఉండవల్లిలో చంద్రబాబును కలిసిన అశ్వారావుపేట అభ్యర్థి
  • టికెట్ కేటాయించినందుకు ధన్యవాదాలు తెలిపిన మెచ్చా
  • మెచ్చాతో పాటు చంద్రబాబును కలిసిన సండ్ర వెంకటవీరయ్య

తెలంగాణలో మహాకూటమి తరపున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం టికెట్ ను పొందిన టీడీపీ నేత మెచ్చా నాగేశ్వరరావు ఆ పార్టీ అధినేత చంద్రబాబును కలిశారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఆయనను మర్యాద పూర్వకంగా కలిశారు. తనకు టికెట్ కేటాయించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, అనునిత్యం ప్రజల కష్టసుఖాల్లో భాగస్వాములు అయినవారికి ఎప్పటికీ గుర్తింపు ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన వెంట సత్తుపల్లి అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య, ఆలపాటి రామ్మోహన్ రావు, గారపాటి సూర్యనారాయణ తదితరులు ఉన్నారు. మరోవైపు, విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని మెచ్చా నాగేశ్వరరావు దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

mecha nageswara rao
sandra venkata veeraiah
Chandrababu
  • Loading...

More Telugu News