vijay: విజయ్ సినిమాలో సమంత .. నయనతార

- విజయ్ హీరోగా అట్లీ మూవీ
- సంక్రాంతికి లాంచ్ చేసే ఆలోచన
- హ్యాట్రిక్ హిట్ పై దృష్టి
విజయ్ 62వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'సర్కార్' సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోన్న విజయ్, తన తదుపరి సినిమాకి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకి అట్లీ కుమార్ దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'తెరి' .. 'మెర్సల్' భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి.
