Kerala: రాంగ్ పార్కింగ్ చేశాడని వాహనదారుడిని నెట్టేసి, అతని మృతికి కారకుడైన డీఎస్పీ.. అనుమానాస్పద స్థితిలో డీఎస్పీ మృతి!

  • వాహనదాడిని తోసేసిన డీఎస్పీ
  • వాహనం ఢీకొని మృతి
  • అప్పటి నుంచి పరారీలో డీఎస్పీ

నో పార్కింగ్ ప్లేస్‌లో కారు నిలిపాడంటూ వాహనదారుడిని తోసేసి అతడి మృతికి కారణమైన డీఎస్పీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కేరళలో చోటుచేసుకుంది. పార్కింగ్ నిషేధించిన చోట కారు నిలిపాడంటూ సోమవారం సనాల్ (34) అనే వ్యక్తిని నెయ్యతింకర డీఎస్పీ హరికుమార్ అతడిని బలంగా తోసేశాడు. రోడ్డుపై పడిన సనాల్‌ కుమార్‌ను అటుగా వెళ్తున్న వాహనం ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన సనాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.

డీఎస్పీ తీరుపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. దీంతో స్పందించిన ముఖ్యమంత్రి పినరయి విజయన్.. హరికుమార్‌ను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. హరికుమార్‌పై హత్యకేసును నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న ఆయన కోసం గాలింపు మొదలుపెట్టారు. అతడి కోసం లుక్ అవుట్ నోటీసు కూడా జారీ చేశారు. హరికుమార్‌ కోసం వెతుకుతున్న పోలీసులకు విచిత్రంగా కల్లంబాల్లంలోని ఆయన ఇంట్లో ఉరేసుకుని కనిపించాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు ఇది హత్యా? ఆత్మహత్యా? అన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.

Kerala
DSP
Harikumar
Neyattinkara
Sanal Kumar
  • Loading...

More Telugu News