New Delhi: తండ్రితో గొడవపడి ఆత్మహత్య చేసుకున్న యువ ప్లేయర్!

  • నిన్న తండ్రితో గొడవ పడిన స్ప్రింటర్ పర్వీందర్
  • ఈ ఉదయం ఉరేసుకుని విగతజీవిగా
  • న్యూఢిల్లీ అథ్లెటిక్స్ అకాడమీలో ఘటన

కన్నతండ్రితో గొడవ పడిన ఓ యువ క్రీడాకారుడు, తానుండే వసతి గృహంలోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధీనంలో న్యూఢిల్లీలో నడుస్తున్న జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియం, అథ్లెటిక్స్‌ అకాడమీలో జరిగింది. ఇక్కడ శిక్షణ పొందుతున్న యువ స్ప్రింటర్ పర్వీందర్‌ చౌదరి (18) ఈ ఉదయం వసతి రూంలోని సీలింగ్‌ ఫ్యాన్‌ కు ఉరేసుకొని విగతజీవిగా కనిపించాడు.

నిన్న అతను తన తండ్రితో ఫోన్ లో మాట్లాడుతూ, గొడవపడ్డాడు. ఆపై పర్వీందర్ సోదరి కూడా మాట్లాడింది. కుటుంబ విభేదాల కారణంగానే పర్వీందర్ బలవన్మరణానికి పాల్పడ్డాడని స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా పేర్కొంది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు.

New Delhi
Sprinter
Sucide
  • Loading...

More Telugu News