Pawan Kalyan: డొక్కు స్కూటర్‌పై వచ్చేవారు.. ఆదరించి టికెట్ ఇస్తే వెన్నుపోటు పొడిచారు: మాజీ ఎమ్మెల్యే కన్నబాబుపై పవన్ కల్యాణ్ ఫైర్

  • పోనీ కదా అని ఆదరిస్తే ద్రోహం చేశారు
  • ఎమ్మెల్యేగా కోట్లు సంపాదించారు
  • టీడీపీపై పోరాటాన్ని ఎంచుకున్నది అందుకే..

తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో మంగళవారం రాత్రి జరిగిన బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే కన్నబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 2008లో విలేకరిగా ఉన్న కన్నబాబు డొక్కు స్కూటరుపై అన్నయ్య చిరంజీవి వద్దకు వచ్చేవారని గుర్తు చేశారు. ఆదరించి 2009లో ప్రజారాజ్యం టికెట్ ఇస్తే వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. ఎమ్మెల్యేగా కోట్ల రూపాయలు సంపాదించిన ఆయన అవినీతిని బయటపెడతానన్నారు. అవినీతి పరుల బాగోతాలను ప్రజల్లోకి తీసుకెళ్తానన్నారు.

ప్రజాసేవ కోసం సినిమాలను, కుటుంబాన్ని వదలుకుని రాజకీయాల్లోకి వచ్చినట్టు పవన్ పునరుద్ఘాటించారు. చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రం అభివద్ధి చెందుతుందని భావించే గత ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇచ్చినట్టు చెప్పారు. అయితే, టీడీపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోవడంతోనే పోరాటబాట ఎంచుకున్నట్టు పవన్ స్పష్టం చేశారు.

Pawan Kalyan
Jana sena
Kanna babu
East Godavari District
Telugudesam
  • Loading...

More Telugu News