Tiger: టూరిస్టులను వెంటాడిన పులి.. భయంతో కేకలు.. వీడియో వైరల్

  • టైగర్ రిజర్వు ఫారెస్ట్‌లో ఘటన
  • భయంతో బిక్కచచ్చిపోయిన పర్యాటకులు
  • డ్రైవర్ వేగం పెంచడంతో తప్పిన ప్రమాదం

మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా తడోబా-అంధారీ టైగర్ రిజర్వ్‌లో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అడవిలో షికారుకు వెళ్లిన పర్యాటకుల వాహనాన్ని పులి వెంబడించడంతో అందులోని పర్యాటకులు భయంతో కేకలు వేశారు. వాహనానికి, పులికి మధ్య దూరం కొన్ని అడుగులు మాత్రమే ఉండడం, వాహనం ఓపెన్ టాప్ కావడంతో పర్యాటకులకు చెమటలు పట్టాయి. అయితే, డ్రైవర్ మరింత వేగం పెంచడంతో అక్కడి నుంచి తప్పించుకోగలిగారు.

పులి వెంబడించిన ఘటనపై రేంజ్ ఫారెస్ట్ అధికారి రాఘవేంద్ర మాట్లాడుతూ.. గతంలోనూ ఇటువంటి ఘటనలు జరిగినట్టు చెప్పారు. పర్యాటకుల వాహనం మరీ దగ్గరగా రావడంతో మూడున్నరేళ్లున్న ‘చోటీ మధు’ అనే పులి ఆందోళనతో వారి వాహనాన్ని వెంబడించిందని పేర్కొన్నారు. పులులు ఉండే ప్రదేశానికి వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని డ్రైవర్లకు సూచించారు. ఘటనకు కారణమైన రహదారిని వారం రోజులపాటు మూసి వేస్తున్నట్టు ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News