Andhra Pradesh: ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. దరఖాస్తు స్వీకరణ గడువు రెండు రోజులు పొడిగింపు

  • ఈ నెల 16తో ముగియనున్న గడువు
  • గడువును రెండు రోజులు పెంచిన ప్రభుత్వం
  • ఆన్‌లైన్ దరఖాస్తుల్లో తప్పులు సరిదిద్దుకునే అవకాశం

ఏపీలోని డీఎస్సీ అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దరఖాస్తు స్వీకరణ గడువును మరో రెండు రోజులు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిజానికి ఈ నెల 15 ఫీజు చెల్లింపునకు ఆఖరి తేదీ కాగా, దరఖాస్తు గడువు 16తో ముగియనుంది. అయితే,  ఆన్‌లైన్ దరఖాస్తులో తప్పులు చేసిన అభ్యర్థులు వాటిని సవరించుకునేందుకు అవకాశం ఇవ్వడం, బీటెక్‌తోపాటు ఇతర డిగ్రీలు చదివిన అభ్యర్థులకు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించడంతో గడువును మరో రెండు రోజులు పొడిగించారు. పొడిగించిన గడువు ప్రకారం ఫీజు చెల్లింపునకు ఈ నెల 17, దరఖాస్తు స్వీకరణకు 18వ తేదీని గడువుగా నిర్ణయించారు.

Andhra Pradesh
DSC-2018
Chandrababu
Students
  • Loading...

More Telugu News