NTR: కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థిగా నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని?

  • పోటీకి ఆసక్తి చూపని  కల్యాణ్ రామ్
  • సుహాసినిని దింపాలని నిర్ణయం
  • ఎన్టీఆర్ కుటుంబం నుంచి రాజకీయాల్లోకి మరొకరు

తెలంగాణ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాజకీయ పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికను దాదాపు ఖరారు చేశాయి. టీఆర్ఎస్ ఓటమి కోసం గట్టిగా పోరాడుతున్న మహాకూటమి కూడా తొలి విడత జాబితాను ప్రకటించింది. కూటమిలోని టీడీపీ ఇప్పటికే కొన్ని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. అయితే, తాజాగా చక్కర్లు కొడుతున్న వార్త ఒకటి ఇటు తెలంగాణలోనూ, అటు ఎన్టీఆర్ కుటుంబంలోను హాట్ టాపిక్‌గా మారింది.

ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టీడీపీ సీనియర్ నేత, పొలిట్ బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినిని కూకట్‌పల్లి నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దించబోతున్నట్టు వార్త ఒకటి హల్‌చల్ చేస్తోంది. మాజీ ఎంపీ చుండ్రు శ్రీహరి కుమారుడు శ్రీకాంత్ భార్యే సుహాసిని. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వద్ద కూడా  ఈ విషయం చర్చించినట్టు చెబుతున్నారు. ఎన్టీఆర్ కుటుంబం నుంచి ఎవరినైనా బరిలోకి దింపాలన్న ఉద్దేశంతోనే ఆమెను అనుకుంటున్నట్టు టీడీపీ సీనియర్ నేత ఒకరు తెలిపారు.  నిజానికి హరికృష్ణ కుమారుడైన కల్యాణ్‌రామ్, సుహాసినిలలో ఎవరో ఒకరిని బరిలోకి దింపాలని భావించామని, అయితే, కల్యాణ్ రామ్ ఆసక్తి కనబరచలేదని పేర్కొన్నారు. దీంతో సుహాసినిని బరిలోకి దింపాలని భావిస్తున్నట్టు చెప్పారు. Source: https://www.facebook.com/suhasini.nandamuri

NTR
Suhasini
Kalyan Ram
Kukatpally
Telangana
Elections
Telugudesam
  • Loading...

More Telugu News