ntr trust bhavan: ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద ఉద్రిక్తత.. శేరిలింగంపల్లి టికెట్ మువ్వాకు ఇవ్వాలంటూ ఆందోళన

  • మువ్వా అనుచరుడి ఆత్మహత్యాయత్నం
  • ఒంటిపై కిరోసిన్ పోసుకున్న అనుచరుడు
  • అడ్డుకున్న కార్యకర్తలు

శేరిలింగంపల్లి టీడీపీ టికెట్ ను భవ్య ఆనంద ప్రసాద్ కు కేటాయించిన విషయం తెలిసిందే. దీనిని నిరసిస్తూ మువ్వా సత్యనారాయణ అనుచరులు ఆందోళనకు చేబట్టారు. దీంతో హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శేరిలింగంపల్లి టీడీపీ టికెట్ ను మువ్వా సత్యనారాయణకు ఇవ్వాలంటూ ఆయన అనుచరులు ఆందోళనకు దిగారు.

ఈ సందర్భంగా మువ్వా అనుచరుడు ఒకరు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. అక్కడే ఉన్న కార్యకర్తలు అతన్ని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పోలీసులు మోహరించారు. మరోవైపు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ముట్టడికి ఉస్మానియా యూనివర్శిటీ (ఓయూ) యాదవ విద్యార్థులు యత్నించారు. యాదవ కులస్తులకు టికెట్ ఇవ్వలేదని నిరసిస్తూ ఆందోళనకు దిగారు. అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు.

ntr trust bhavan
Hyderabad
serilingampalli
  • Loading...

More Telugu News