OnePlus 6T: ఇండియాకి వచ్చేసిన 'వన్ ప్లస్ 6టీ' థండర్ పర్పుల్ వేరియెంట్‌!

  • 8జీబీ వేరియంట్లో విడుదల 
  • ఈనెల 16 నుండి విక్రయం 
  • హెచ్.డీ.ఎఫ్.సి కార్డు, జియో రీచార్జీలపై పలు ఆఫర్లు

వన్ ప్లస్ 6టీ స్మార్ట్ ఫోన్ నుండి థండర్ పర్పుల్ కలర్ వేరియెంట్‌ తాజాగా భారత మార్కెట్లో విడుదలైంది. 8 జీబీ వేరియంట్ లో ఈనెల 16 నుండి అమెజాన్, వన్ ప్లస్, రిలయన్స్ డిజిటల్, క్రోమా లాంటి ఆన్ లైన్ స్టోర్లతో పాటు ఆఫ్ లైన్ స్టోర్ లలో కూడా వినియోగదారులకి అందుబాటులోకి రానుంది. దీని ధర రూ.41,999గా ఉంది. అలాగే హెచ్.డీ.ఎఫ్.సి కార్డులపై క్యాష్ బ్యాక్ ఆఫర్ తో పాటు జియో రీచార్జీలపై పలు ఆఫర్లు ఉన్నాయి.

వన్ ప్లస్ 6టీ ప్రత్యేకతలు:

  • 6. 41" డిస్ప్లే
  • వెనుకభాగంలో రెండు 20/16 మెగాపిక్సల్ కెమెరాలు
  • ముందు భాగంలో 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
  • 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
  • స్నాప్ డ్రాగన్ 845 ప్రాసెసర్
  • 3700 ఏంఏహెచ్ బ్యాటరీ

OnePlus 6T
Thunder Purple Edition
Tech-News
technology
India
China
  • Loading...

More Telugu News