Telangana: తెలంగాణ భవన్ కు చేరిన సీట్ల లొల్లి.. మన్నెం గోవర్ధన్ రెడ్డి వర్గీయులపై పోలీసుల లాఠీచార్జీ!

  • ఖైరతాబాద్ టికెట్ ఇవ్వకపోవడంపై ఆగ్రహం
  • తెలంగాణ భవన్ ముట్టడికి యత్నించిన నేత
  • ఎమ్మెల్సీ లేదా కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తామన్న కేటీఆర్

ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో రాజకీయం వేడెక్కుతోంది. తమకు టికెట్లు దక్కకపోవడంతో పలువురు ఆశావహులు ఆయా పార్టీల కార్యాలయాల ముందు ఆందోళనకు దిగుతున్నారు. తాజాగా టీఆర్ఎస్ నేత మన్నె గోవర్ధన్‌రెడ్డి తన అనుచరులతో కలిసి తెలంగాణ భవన్ ను ముట్టడించారు. దీంతో ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయన్ను టీఆర్ఎస్ కార్యకర్తలు సమీపంలోని సిటీ న్యూరో ఆసుపత్రికి తరలించారు.

ఈ సందర్భంగా తమ నాయకుడికి ఖైరతాబాద్ అసెంబ్లీ టికెట్ ను కేటాయించాలని కోరుతూ ఆయన అనుచరుడు ఒకరు తల పగులగొట్టుకున్నాడు. ఖైరతాబాద్ లో పోటీ నుంచి తప్పుకుంటే ఎమ్మెల్సీ లేదా కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తామని మంత్రి కేటీఆర్ ఇప్పటికే గోవర్ధన్ రెడ్డికి ఆఫర్ ఇచ్చారు. అయితే ఇందుకు ససేమిరా అన్నట్లు సమాచారం. తనకు ఖైరతాబాద్ టికెట్ కావాలని ఆయన గట్టిగా కోరుతున్నట్లు తెలుస్తోంది.

Telangana
Telangana bhavan
TRS
khairatabad
mla seat
Police
lathi charge
  • Loading...

More Telugu News